మారుతీ రావు అంత్యక్రియలు నేడే ! అమృతకు నో చెప్పిన తల్లి, బాబాయ్…


ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు నిన్న అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, తండ్రిని కడసారి చూసేందుకు అమృత వర్షిణి పోలీసుల భద్రత కోరింది. అందుకు తల్లి గిరిజ, బాబాయ్ శ్రావణ్ అంగీకరించలేదు. తాము ఎట్టిపరిస్థితుల్లో తండ్రిని చివరిసారిగా చూసేందుకు ఒప్పుకోబోమని బాబాయ్ శ్రావణ్ స్పష్టం చేశారు.

కాగా, మారుతీరావు స్వగృహంలో మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళి అర్పిస్తున్నారు. కాగా, తన భర్త ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అమృత చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని ఆమె బాబాయ్ శ్రావణ్ తీవ్రంగా ఖండించారు.

తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది:
తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది. అయితే తండ్రిని చూసేందుకు తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించలేదు. మారుతీ రావు స్వగృహంలో మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మారుతీరావు అంతిమయాత్ర మొదలు కానుంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిక (షాబునగర్)లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మారుతీరావు పోలీసులు అంతిమయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…

No comments

Powered by Blogger.