శానిటైజర్ అనుకొని ఏమి నొక్కాడో తెలుసా?


కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. పాకిస్థాన్ లో కూడా కరోనా వైరస్ ప్రజలను భయపెట్టింది. ఈ వైరస్ కారణంగా అక్కడ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.ఈ క్రమంలో డాక్టర్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించటంతో ప్రజలు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని గుజరంవాలాలో ఓ వ్యక్తి సూపర్ మార్కెట్లో వెళ్లి షాపింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్ అనుకొని ఫైర్ ఎక్టింగ్యూషర్ సిలిండర్‌ని నోక్కాడు.అంతే ఒక్కసారిగా సూపర్ మార్కెట్ అంతా పొగతో నిండిపోయింది. దాంతో ఆ వ్యక్తి తనకేమి తెలియనట్టుగా ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయమంతా సూపర్ మార్కెట్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పాకిస్థాన్ లో 33 మందికి పైగా కరోనా వైరస్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.

No comments

Powered by Blogger.