దేవుడికీ మాస్క్ ! కరోనా భయంతో ఏకంగా శివలింగానికే…
కరోనా వైరస్ ప్రభావం మనుషులకే కాదు, దేవుళ్లకు కూడా తప్పడం లేదు. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు మనుషులు మాస్కులు ధరించినట్టుగా దేవుళ్లకు కూడా మాస్కులు పెట్టి పూజలు చేస్తున్నారు. వారణాసిలో గల విశ్వనాథ్‌ ఆలయంలో చోటు చేసుకుంది. దేవుడికి మాస్కులు కట్టి పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉందని, నిర్వాహకులు చెబుతున్నారు. దీన్ని చూసి అయినా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆలయంలోని విగ్రహానికి మాస్క్‌ కట్టినట్లు పూజరి వివరించారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విగ్రహంపై వస్త్రంతో కప్పి ఉంచుతున్నారు. వేడిగా ఉన్న సమయంలో మాస్క్‌ను కడుతున్నట్టు పూజరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని ఆలయానికి వచ్చిన భక్తులకు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.