నా వల్లే మారుతీరావు చనిపోయాడంటే అంగీకరించను: అమృత
తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు తానే కారణమంటే అంగీకరించేది లేదని ఆయన కుమార్తె అమఅత స్పష్టం చేసింది. సోమవారం ఉదయం తనను కలిసిన మీడియాతో అమఅత మాట్లాడుతూ:
తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసునని, వాటివల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, అల్లుడిని చంపించానన్న పశ్చాత్తాపం కూడా వెంటాడి ఉంటుందని పేర్కొంది. ఎప్పుడైతే తన భర్తను హత్య చేయించారో, ఆ క్షణం నుంచి తనకు ఆయనపై ఆప్యాయత చచ్చిపోయిందని, ఇప్పుడు తనలో ఎలాంటి భావోద్వేగాలూ కలగడం లేదని వెల్లడించింది. తనకు తండ్రిని చివరి సారిగా చూడాలని మాత్రం ఉందని, అందుకు పరిస్థితులు అంగీకరిస్తే, వెళ్లి వస్తానని తెలిపింది.
ఇదిలావుండగా, సోషల్ మీడియాలో అమృతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిపై ప్రేమ లేకున్నా, కన్న తల్లిపై కనికరం ఉన్నా, ఈ పాటికి ఆమె ఇంటికి వెళ్లి, తల్లికి తోడుగా ఉండేదని కామెంట్లు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అమఅత, తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడనివారు, ఇప్పుడు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడింది. మరోవైపు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు పట్టణ ప్రముఖులు తరలివచ్చారు. కుమార్తెపై ఉన్న వల్లమాలిన ప్రేమే, ఓ మంచి వ్యక్తిని ఈ స్థితికి చేర్చిందని పలువురు వ్యాఖ్యానించారు.
Post a Comment