మీరు ఎప్పుడన్నా ఐస్‌క్రీమ్ దోశ తిన్నారా..? అది ఎలా ఉంటుందో తెలుసా...?


దోశ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం. దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది. అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. అయితే భోజన ప్రియులు కొత్తగా ఏ టేస్టీ వంటకం వచ్చినా అక్కడికి వాలిపోతారు. ఆ ఫుడ్‌ను చక్కగా ఆస్వాదిస్తూ ఆరగించడమే కాకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కూడా.

ఇప్పుడు అలాంటి కోవలోనే తాజాగా ‘ఐస్‌క్రీమ్ దోశ’ ఫేమస్ అవుతోంది. బెంగళూరులోని ఓ టిఫిన్ సెంటర్ యజమాని నా స్టైలే సెపరేట్ అంటూ కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. దోశలను, ఇడ్లీలను, వడలను చట్నీ, సాంబార్‌లతో కాకుండా ఐస్‌క్రీమ్‌లతో వచ్చిన కస్టమర్లకు రుచి చూపిస్తూ తన వ్యాపారాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. దోశకు పైనా, కింద ఐస్‌క్రీమ్ పూత పూయడమే కాకుండా ప్లేట్లలో ఐస్‌క్రీమ్ స్కూప్స్ వడ్డిస్తున్నాడు. కస్టమర్లు అందరూ కూడా దోశను తుంచుకుని తింటూ టేస్ట్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు.

ఇక అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర దాన్ని ట్యాగ్ చేసి ఆ హోటల్ యజమాని ఐడియాకు ఫిదా అయిపోయారు. ‘భారతీయ వీధి విక్రేతలు ఆవిష్కరిస్తున్న సరికొత్త ఆలోచనలకు ఫిదా అయ్యానని’ పేర్కొన్నారు. అక్కడ ఐస్‌క్రీమ్ దోశలతో పాటుగా ఐస్‌క్రీమ్ ఇడ్లీలు కూడా ప్రసిద్ధి చెందాయి. అయితే కొందరు వీటిని మెచ్చుకోగా.. మరికొందరు దానికి భిన్నంగా స్పందించారు.

No comments

Powered by Blogger.
close