కీచక లెక్చరర్ ! పెళ్లి పేరుతో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం…


విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే ఇలా కామాంధులుగా మారి విద్యార్థినులనే చేరబడుతున్నారు. ఇదే తరుణంలో సూర్యపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఓ ఆధ్యాపకుడు డిగ్రీ విద్యార్థినిని పెళ్లి పేరుతో లొంగదిసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అదే కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న లింగయ్య అనే వ్యక్తి యువతిని ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు. ఆయనకు అప్పటికే పెళ్లయినా, యువతిని పెళ్లి చేసుకుంటానని, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు.అదే విషయం తల్లిదండ్రులకు చెప్పితే ఎక్కడ చదువు మన్పిస్తారో అని భయంతో ఎవరికీ చెప్పలేదు. దీనిన్నే ఆసరాగా తీసుకున్న లెక్చరర్ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని ఆమెను బెదిరించడంతో లొంగిపోయింది. దీంతో యువతిని పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చి 21వ తేదీన విద్యార్థినిని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడడంతో పెళ్లి పేరుతో తనను లైంగికంగా దోచుకుంటున్నాడని గ్రహించిన బాధితురాలు తీరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments

Powered by Blogger.