తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపు…


తెలంగాణలో కరెంట్ ఛార్జీలను పెంచుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. విద్యుత్ సంస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా ఛార్జీలు పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి శషభిషలు లేకుండా అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నానని..ఖచ్చితంగా ఛార్జీలు పెంచి తీరుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీ చేస్తున్న డిస్కంల ఆర్దికలోటు దాదాపు రూ.11వేల కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు.ఇళ్లకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ లో యూనిట్ కు 32 పైసల చొప్పున డిస్కమ్ లు నష్టపోవాల్సి వస్తుందని వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 2019 సెప్టెంబర్ నాటికి కరెంట్ కొనుగోలుకు సంబంధించిన అప్పులు రూ.13,660 కోట్లకు చేరాయి. డిస్కంలు కరెంట్ కొంటూ డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేస్తున్నాయి. 2019లో రూ.9 వేల కోట్లకు పైగా ఆర్ధిక లోటు అంచనా వేస్తూ డిస్కంలు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సమర్పించాయి.విద్యుత్ సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన మొత్తంలో ప్రభుత్వం రూ.4980 కోట్లు మాత్రమే చెల్లించింది. 2019 ఒక్క సంవత్సరమే రూ.3 వేల కోట్లకు పైగా డిస్కమ్ లకు ఆర్ధిక వ్యత్యాసం ఏర్పడింది. 2019 సెప్టెంబర్ నాటికి యూనిట్ కు 0.32 పైసలకు పైగా నష్టం ఉండడంతో సబ్సిడి కూడా పెంచే అవకాశాలు లేకపోయింది. దీంతో ఛార్జీల సవరణ తప్పనిసరిగా మారిందని అధికారులు తెలిపారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా ఛార్జీల పెంపు తప్పనిసరని ప్రకటించడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments

Powered by Blogger.
close