Braking: తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 15కరోనా పాజిటివ్ కేసులు…
మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు ఇవాళ 15 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్దారణ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టివ్ కేసులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మర్కజ్ నుంచి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవడానికి గాంధీ ఆస్పత్రికి రావాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు, వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే డయాలసిస్, తలసేమియా, సికెల్ సెల్ జబ్బులున్న వారికి రక్తమార్పిడి అసరమవుతుంది కాబట్టి వీరు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారని, పోలీసులు వీరిని అడ్డుకోవద్దని తెలియజేసింది. గర్బిణీ స్త్రీలకు ఇబ్బందులు లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పని చేస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసకుంటోందని, ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందగా 14 మంది కోలుకున్నారు.
మర్కజ్ నుండి వచ్చిన వారికి వారి బంధువులకు కలిపి 15 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టీవ్ పాజిటివ్ కేసులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మర్కజ్ నుండి వచ్చిన వారందరు గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరుతున్నాం. pic.twitter.com/1d8Rbsfpvf— Minister for Health Telangana State (@TelanganaHealth) March 31, 2020
Post a Comment