సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయితే అంతగా అదనపు ఆదాయానికి ఆస్కారం పెరుగుతుంది. చిన్నా చితకా అకౌంట్లు వున్న వారికే స్పాన్సర్డ్ ట్వీట్‌కి వేలల్లో చెల్లిస్తుంటారు. ఇక మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వుండే సెలబ్రిటీలు కావాల్సిన పోస్ట్ వేస్తే ఎంత ఇస్తారనుకుంటున్నారు? ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ వున్న ప్రియాంక చోప్రాకి ఒక స్పాన్సర్డ్ ట్వీట్‌కి అక్షరాలా కోటీ తొంభై లక్షలు చెల్లిస్తుంటారు. ఆమె తర్వాత టాప్ సెలబ్రిటీ అయిన విరాఠ్ కోహ్లీకి కూడా ఒక స్పాన్సర్డ్ పోస్ట్‌కి కోటీ ముప్పయ్ లక్షల వరకు ఇస్తుంటారు. గతంలో యాడ్ చేస్తేనో, సంవత్సరమంతా ఒక ప్రోడక్ట్‌ని ఎండార్స్ చేస్తేనో ఇంత మొత్తం వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఒక ప్రాడక్ట్ గురించి నాలుగు లైన్లు పోస్ట్ చేస్తే కోట్లు వచ్చి పడుతున్నాయి. ఈ ఆదాయం కోసమే సెలబ్రిటీలు ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఫిమేల్ సెలబ్రిటీలు అయితే తరచుగా తమ అందాలని ప్రదర్శించి ఫాలోవర్స్‌ని ఆకర్షిస్తున్నారు. సినిమా అవకాశాలు లేని వారికి కూడా ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ఇన్కమ్ సోర్స్‌గా మారిపోయింది.
Post a Comment