కరోనపై నిభంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు: చందన దీప్తి IPS


ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోన(కోవిడ్ 19) మహామ్మారిని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మెదక్ జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఈ కరోనా వ్యాధి నివారణకు చేపట్టిన లాక్ డౌన్ ను అతిక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ: లాక్ డౌన్ సందర్బంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయము తో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒకరు సామాజిక కనీస దూరమును పాటిస్తూ, వ్యక్తి గత భద్రత పాటిస్తూ అత్యవసర పరిస్థితిలలో తప్ప బయటకు రాకుండా ఇండ్లలలోనే ఉండాలని అన్నారు.కొందరు తమ సొంత లాభాల కోసం స్వార్దంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఈ ఉత్తర్వులని ఉల్లంఘిస్తున్నారని, వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నర్సాపూర్ లో పోలీస్టేషన్ పరిధిలో ఈ లాక్ డౌన్ ను ఉల్లంగించి అక్రమంగా కళ్ళు అమ్ముచున్న వారిపై 6 ఎక్సైజ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, రేగోడ్ పోలీస్టేషన్ పరిధిలో ఒక ఎక్సైజ్ కేసు నమోదు చేయడం జరిగిందని, చిల్పీచేడ్ పోలీస్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేయడం జరిగిందని, మెదక్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ఒక హోటలు పై ఒక కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు, అలాగే అత్యవసర వాహనాలకు రాకపోకల గురించి దారులు వదలకుండా రోడ్డుకు అడ్డంగా కంచెలు వేసి అత్యవసర సేవల వాహనాల, నిత్యావసర వస్తువుల సరఫరా చేసే వాహనాలను నిలిపివేసినందుకు గాను నర్సాపూర్ లో ఒక కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా విదేశాల నుండి మన జిల్లాకు వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా వుంచడం జరిగిందని, ఇప్పటివరకు విదేశాల నుం వచ్చిన 82 మంది పాస్ పోర్ట్ లు స్వాధీనం చేసుకొని సీజు చేయడం జరిగిందని ఎస్.పి. గారు తెలిపారు. అలాగే అత్యవసర సేవల వాహనాలు, నిత్యావసర వస్తువుల సరఫరా వాహనాల మినహా, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాహనాలను అనుమతించబోమని జిల్లా ఎస్.పి. గారు హెచ్చరించారు, కాదని ఎవరైనా వాహనాలతో రోడ్లపైకి వస్తే అట్టి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కరోనా వ్యాప్తి నివారణలో అన్ని రకాలుగా ప్రజలు సహకరించాలని, స్వీయ నిర్బంధంతో సహా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలని, ఈ కరోన బారిన పడకుండా తమని తాము స్వీయ నిర్బంధం పాటించి తద్వారా ఈ జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుటకు తమవంతుగా సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు.కరోనా వ్యాధికి సంబంధించి వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. వాట్సప్ లలో ఫేక్ న్యూస్ లను పెట్టవద్దని ఒకవేళ ఫేక్ న్యూస్ లు పెడితే మెదక్ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 7330671900కి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, లేదా డయల్ 100 కి సమాచారం అందజేయాలని సూచించారు. అలాగే తమ పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్నారని, వీరిని తీసుకొని రావడానికి ఎవరికి అనుమతి లేదని, ఎక్కడ వున్నవారు అక్కడే ఉండిపోవాలని దీనికోసం ఎలాంటి NOC ఇవ్వబడవని జిల్లా ఎస్.పి. గారు స్పష్టం చేశారు. ఇందుకోసం ఎవరుకూడా పోలీస్టేషన్లకు గాని, ఎస్.పి. కార్యాలయానికి గాని రాకూడదని తెలిపారు.

No comments

Powered by Blogger.