నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నాం: మంత్రి KTR…


కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం.హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. నిజాముద్దీన్‌ ఘటన తర్వాత అప్రమత్తం అయ్యాం. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం. లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా ఫ్రీ తెలంగాణే మా లక్ష్యం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నాం. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్లను కలిన వాళ్లంతా పరీక్షలు చేసుకోవాలి. వారందరికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహిస్తుందని కేటీఆర్‌ తెలిపారు.

సిరిసిల్ల జిల్లాలో: కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం చేయాలి : రాష్ట్ర మంత్రి శ్రీ కె.తారకరామారావు.

జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారుమంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు: ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి , జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేసారు.

జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న 1032 మందిని ఏప్రిల్ 7వ తేదీ దాకా బయటకు రాకుండా చూడాలని , క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి పాస్ పోర్ట్ లు రద్దు చేయాలని ఆదేశించారు. దక్షిణ కొరియా దేశం లో కేవలం ఒక వ్యక్తి ద్వారా ఆ దేశంలోని 59 వేల మందికి కరోనా వ్యాధి సోకిందని, నిర్లక్ష్యంగా ఉంటే మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర గ్రామాల నుంచి తమ గ్రామంకు వచ్చే వ్యక్తులను కూడా గ్రామ ప్రజలు స్వీయ గృహ నిర్భంధం లో ఉంచేలా చూడాలని కోరారు.ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, నిర్మాణరంగం ,ఇరిగేషన్ ప్రాజెక్టుల లో పని చేస్తున్న వలస కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని కలెక్టర్ ను ఆదేశించారు. వారికి షెల్టర్ సౌకర్యం కల్పించాలని, ఆనారోగ్యంగా ఉన్న కార్మికులకు అవసరమైన మందులను, వైద్య సేవలను ఉచితంగా అందించాలని జిల్లా వైధ్యాదికారిని ఆదేశించారు. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా ఉచితంగా కల్పిస్తున్న భోజన సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిరుపేద ప్రజలు అన్నపూర్ణ క్యాంటీన్ ల ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

No comments

Powered by Blogger.