తప్పు చేసినవాడు TRS పార్టీ అయిన వదిలే ప్రసక్తే లేదు…
అసెంబ్లీలో వినయ్ భాస్కర్ ను రాహుల్ తో కలిసి ప్రకాష్ రాజ్ కలిశాడు. దాంతో గొడవ రాజీ కోసం ప్రకాష్ రాజ్ మద్యవర్థిత్వం చేస్తున్నట్లుగా అంతా భావించారు. అయితే వినయ్ భాస్కర్ ను కలిసిన తర్వాత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పబ్ లో జరిగిన గొడవకు కారణం రాహుల్ కాదు. రాహుల్ ఏమీ తప్పు చేయనప్పుడు రాజీ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.

రాహుల్ పై దాడి చేసిన వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అని ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ వినయ్ భాస్కర్ ను కలవడం వెనుక కేసుకు సంబంధించిన ఉద్దేశ్యం ఏమీ లేదని, మర్యాద పూర్వకంగానే కలిసినట్లుగా చెప్పుకొచ్చాడు.వినయ్ భాస్కర్ తో కేసుకు సంబంధించిన ఎలాంటి విషయాలు చర్చించలేదంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం జోక్ అంటున్నారు. రాహుల్ ను వెంట పెట్టుకుని మర్యాదపూర్వకంగా కలిశాను అంటూ అబద్దం చెప్పడం ఎందుకో అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.


No comments

Powered by Blogger.