అరుణాచలం కొండగుహలో దాగిన చైనా యువకుడు| 11 రోజులుగా అక్కడే మకాం ! పోలీసు విచారణ..
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం మహాదీపం కొండపై చైనా యువకుడు దాగి ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో అతను చైనాలోని బీజింగ్‌ ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. గత నెల 25వ తేదీన మహాదీపం కొండపైకి వెళ్లి అక్కడే దాగి ఉన్నట్లు తెలిసింది. సదరు యువకుడు కొండపైకి ఎందుకు వెళ్లాడు, అతనికి ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

No comments

Powered by Blogger.