తెలంగాణ: ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31 మందికి కరోనాను అంటించింది..!


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రకటించింది. దీంతో బయటికి వెళ్లే వీలు లేక ఎవరికి నచ్చిన విధంగా వారు టైంపాస్ చేస్తున్నారు. కొంత మంది టీవీలు చూస్తూ గడుపుతుంటే, కొంత మంది వారి ఫోన్లలో ఆడుకుంటూ గడుపుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. కొంత మంది గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటుంటే, కొంత మంది పాత ఆటలు కైలాసం, అష్టాచెమ్మా లాంటి ఆటలు ఆడుతున్నారు.ఇప్పుడు ఈ ఆటలే కొంపలు ముంచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 మందికి కరోనా వ్యాపించింది. ఓ మహిళ తనకి టైంపాస్ కాక ఆ ఇంటా, ఈ ఇంటా చేరి అష్టాచెమ్మా ఆడడం మొదలు పెట్టింది. దీంతో తనతో ఆడిన వారందరికీ కరోనా వచ్చింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ నగరం మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో సూర్యాపేట జిల్లా చేరుకుంటుంది. ఈ జిల్లాలో అతి తక్కువ కాలంలోనే కరోనా కేసులు కుప్పులుగా పెరిగిపోతున్నాయి.అసలు ఆ కేసులు ఈ విధంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి అధికారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ నేతృత్వంలోని బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. దీంతో వారిని నమ్మలేని నిజాలు తెలిసాయి. తబ్లిగి జమాత్‌ మీటింగ్‌కు వెళ్లివచ్చినవారితో కాంటాక్ట్‌ అయిన ఒక్క మహిళ ద్వారానే 31కేసులు నమోదయ్యాయని తెలుసుకున్నారు.కాగా ఆ మహిళకు కరోనా వచ్చిందన్న విషయం తెలియక తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి ముచ్చట్లతో కాలం గడపడం మాత్రమే కాకుండా, ఇతరులతో అష్టాచెమ్మ కూడా ఆడింది. దీంతో ఆమె ద్వారా ఇతరులకు కూడా కరోనా సోకిందని తెలుసుకున్నారు. కాగా ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో నమోదయిన 83 కేసుల్లో ఆ మహిళ ద్వారా సోకినవే సగం ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. మరింత మందికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి అప్రమత్తమయిన ప్రభుత్వం కరోనా బాధితులు ఎవరిని కలిసారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు బయటికి రాకుండా ఇండ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు.

No comments

Powered by Blogger.
close