తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌. ఎలాంటి సడలింపులు లేవు…


తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.మే 5న మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో ఏప్రిల్‌ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.



గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.



కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ: ఒక్క కరోనా కేసు కూడా లేని జిల్లాలు రాష్ట్రంలో 4 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2.44 శాతంగా ఉందని, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 రోజులకు రెట్టింపవుతోందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య సిబ్బందికి అవసరమయ్యే పరికరాల కొరతను అధిగమించామన్నారు.

No comments

Powered by Blogger.
close