తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.! ఈరోజు ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు…


కరోనా వైరస్ రోజు రోజుకి తెలుగు రాష్ట్రాలలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈరోజు ఒక్కరోజే తెలంగాణాలో 75 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ఇంతలా ఒక్కసారిగా పెరగడంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వాధికారులు వేడుకుంటున్నారు.అధికారులు ఎంత చెప్పినా కొంతమంది వినకుండా ఇష్టానుసారంగా బయట తిరగడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు., ఈరోజు నమోదైన 75 కేసులతో తెలంగాణలో మొత్తం 229 కేసులకు చేరుకోవడం జరిగింది. ఇక తెలంగాణలో 11 మంది ఇప్పటి వరకు కరోనా వైరస్ తో చనిపోయారు. ఏపీలో ఈరోజు 21 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2500 దాటడం జరిగింది.No comments

Powered by Blogger.
close