సొంతంగా 🍻మద్యం తయారీ.! తాగిన ఒకరి మృతి.. వికటించిన ప్రయోగం !! మరో ఇద్దరి పరిస్థితి


ఆరుగురు స్నేహితులు కలిసి సొంతంగా మద్యం తయారు చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అది తాగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో చోటుచేసుకుంది. వేల్పూరుకు చెందిన ధర్నాల నవీన్‌ మూర్తి (22), అల్లాడి వెంకటేశ్‌, కావలిపురానికి చెందిన పండూరి వీరేశ్‌, తణుకు దుర్గారావు, వెంకట దుర్గాప్రసాద్‌, విప్పర్తి శ్యాంసుందర్‌ ఆదివారం పార్టీ చేసుకుందామనుకున్నారు.ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌, దానిలో గ్లిజరిన్‌, హైడ్రోపెరాక్సైడ్‌ కలిపి ఒక ద్రావణంగా తయారు చేశారు. వారంతా ఆదివారం రాత్రి ద్రావణాన్ని తాగి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి నవీన్‌కు కడుపులో మంట రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. వీరేశ్‌, వెంకటేశ్‌లకు కడుపులో విపరీతమైన మంట రావడంతో మంగళవారం రాత్రి తణుకులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

No comments

Powered by Blogger.