అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి, అత్యంత నిరాడంబరంగా. పెళ్లి కొడుకు తండ్రి మాజీ ముఖ్యమంత్రి, తాత మాజీ ప్రధాని..


పెళ్లి కొడుకు తండ్రి మాజీ ముఖ్యమంత్రి, తాత మాజీ ప్రధాని, పెళ్లి కొడుకు సినిమా హీరో కూడా. పెళ్లి కూతురు కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరపాలని ఇరుకుటుంబాలు నిశ్చయించాయి. నిశ్చితార్థ వేడుకను బ్రహ్మాండంగా జరిపారు కూడా.తీరా పెళ్లి మహూర్తానికి కరోనా అడ్డొచ్చింది. దీంతో ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరుగుతోంది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌- రేవతి పెళ్లి వేడుక ఈరోజు కేతగానహళ్లిలో ఫాంహౌస్‌లో జరిగింది. కరోనా లాక్ డౌన్ కారణంగా.. అత్యంత సమీప బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. వివాహ మహోత్సవంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తామని అధికారులనుంచి అనుమతి తీసుకున్నారు కుటుంబ సబ్యులు.

No comments

Powered by Blogger.