మహిళ స్నానం చేస్తుండగా డ్రోన్ సహాయంతో వీడియో చిత్రీకరించి..!


ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువ ఇంజినీర్ డ్రోన్ సహాయంతో వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బెదిరించిన సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పుదుమఠంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:లాక్‌డౌన్ నేపథ్యంలో శివ కుమార్ అనే యువకుడు ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదే అదునుగా భావించిన యువకుడు డ్రోన్ సహాయంతో పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఆమె వాట్సప్ నంబర్ కు పంపించి బెదిరించాడు. దీంతో సదరు మహిళ తన భర్తకు ఈ విషయం తెలిపడంతో దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శివ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా కాలనీలోని మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బెదిరించినట్టు సమాచారం.

No comments

Powered by Blogger.