పాల ట్యాంకర్ లో విద్యార్థుల అక్రమ ప్రయాణం.| పొందుగల చెక్‌పోస్టు వద్ద అదుపులోకి…


పొందుగల చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులుగుంటూరు, ఏప్రిల్‌ 19: లాక్‌డౌన్‌లో రవాణా కట్టడి చేయడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్ళకు వెళ్ళేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ పాల ట్యాంకర్‌లో నక్కి రాష్ట్రంలోకి వచ్చేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాష్ట్ర సరిహద్దులోని పొందుగుల చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు సమయంలో ట్యాంకర్‌లో నక్కి వస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌ నుంచి సింగరాయకొండకు వెళ్తున్న ఖాళీ పాల ట్యాంకర్‌లో నల్గొండ జిల్లా మిరియాలగూడ నుంచి ప్రకాశం జిల్లా కారంపూడి వెళ్లేందుకు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రయాణం ప్రమాదకరమైన వారిని ఎక్కించుకున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ట్యాంకర్‌ను సీజ్‌ చేశారు.

No comments

Powered by Blogger.