డాక్టర్ల జోలికొస్తే మక్కెలిరగదీస్తాం..! ఆస్పత్రి ముందు కరోనా ప్రొటెక్షన్ ఫోర్స్…


మాస్క్ లు, సేఫ్టీ ప్రికాషన్స్ తో ఆస్పత్రి ముందున్న వీరు డాక్టర్లు కాదు, పోలీసులు. గాంధీ ఆస్పత్రి వద్ద ఇలా బందోబస్తు డ్యూ టీ చేస్తున్నారు. డాక్టర్ల జోలికొస్తే తాటతీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ బంధువులు డాక్టర్లపై దాడి చేసిన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 27 మంది ఎస్‌ఐలు సహా మొత్తం 200 మంది గాంధీ ఆస్పత్రి వద్ద మోహరించారు.మొత్తం నాలుగు అంతస్తుల్లో, మొదటి 5,6 ఫ్లోర్స్‌లో ఐసోలేషన్ వార్డు ఉండగా, 7,8 అంతస్తుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తారు. గాంధీ ఆస్పత్రికి మూడంచెల భద్రత కల్పించారు అధికారులు. బుధవారం కరోనా పాజిటివ్ రోగులు డాక్టర్లపై దాడికి దిగిన ఘటన సంచలనమైంది. ఈ నేథప్యంలో మరలా దాడి జరిగే అవకాశం ఉన్నందున భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

No comments

Powered by Blogger.