కరోనా హెల్ప్ లైన్ కి 📞ఫోన్ చేసి సమోసాలు అడిగాడు |కోరిక తీర్చిన కలెక్టర్..!
తిన్న తర్వాత మరుగు దొడ్లు కడిగించాడు..
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాత పడగా, లక్షల్లో కరోనా బాధితులు ఉన్నారు. కరోనా కట్టడి చేయడానికి కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్త లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వైరస్ తమకు సోకిందని పలువురు భయాందోళనకు గురవుతుండడం తో ప్రజల కోసం హెల్ఫ్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక పోలీసులు అయితే తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి కుటుంబాలకి దూరంగా ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల కోసం హెల్ప్లైన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటుచేసుకుంది.
కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు రాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పదేపదే ఫోన్ చేసి నాలుగు సమోసాలు తెమ్మని డిమాండ్ చేశాడు. ఎంత చెప్పిన వినకపోవడంతో అతడికి సమోసాలు అందజేయడమే కాకుండా తమ విధులకు ఆటంకం కలిగించినందుకు బోనస్‌గా మరుగుదొడ్లు శుభ్రం చేయాలనే సామాజిక శిక్ష విధించినట్లు కలెక్టర్ తెలిపారు. ‘సరైన శిక్ష’ విధించారంటూ నెటిజెన్లు స్పందిస్తున్నారు.
Post a Comment