డాక్టర్ల సేవలను అభినందిస్తూ వీడియో సాంగ్…


కరోనా ను జయించేందుకు ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న డాక్టర్లు, శానిటేషన్, హెల్త్ కేర్ ఎంప్లాయిస్ సేవలను ప్రశంసిస్తూ ఇండియన్ అమెరికన్ సింగర్ అనురాధ పాలకుర్తి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “రుక్తా నహీ తు కహిన్ హర్ కే” అంటూ మొదలైన ఈ పాటలో కరోనా పై పోరాడుతున్న వారందరూ రియల్ హీరోస్ తో పోల్చారు.బోస్టన్ కు చెందిన జుజు అనే ప్రొడక్షన్ సంస్థ ఈ పాటకు స్పాన్సర్ గా నిలిచింది. సునయనా కచ్రూ సాంగ్ రాయగా కమలేష్ భడ్కంకర్ మ్యూజిక్ అందించారు. అనురాధ పాలకుర్తి పాట పాడారు. కరోనా పై పోరాటంలో చాలా మంది భారత సంతతికి చెందిన డాక్టర్లు కృషి చేస్తున్నారని వారి సేవలను అభినందించే ఉద్దేశంతో ఈ సాంగ్ చేశామని సింగర్ అనురాధ పాలకుర్తి చెప్పారు.

No comments

Powered by Blogger.