కరోనా దెబ్బకు తోక ముడిచిన నిఖిల్| పెళ్లి వాయిదా…


కరోనా కాదు ఏదొచ్చినా పెళ్లి ఆగదంటూ చెప్పిన హీరో నిఖిల్‌కు కష్టాలు తప్పలేదు. ఈ నెలలో జరగాల్సిన చాలా పెళ్లిలు ఇప్పటికే వాయిదా పడుతున్నాయి. ఇదే బాటలో యంగ్ హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు. ఈ నెల 16న జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపాడు. ఇటువంటి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు భద్రత చాలా ముఖ్యమని, అందుకే తాము పెళ్లిని వాయిదా వేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నాడు.ఈ నిర్ణయంతో చాలా మంది కొంచెం కలత చెందుతారని, కానీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. నిఖిల్ వివాహం డాక్టర్ పల్లవితో ఇటీవల నిశ్చమైంది. ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇటీవల కరోనా విజృంభించడంతో లాక్‌డౌన్ అమలు చేసి ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. ఫంక్షన్స్, ఎక్కువగా మంది గంపులుగా ఉండటంపై నిషేధం విధించారు.దీంతో వారి పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇటీవల నిఖిల్ పెళ్లి వాయిదాపై ప్రచారం జరగగా దాన్ని ఖండించాడు. తమ పెళ్లిని కరోనా గాని ఇంక వేరేది ఏది గాని ఆపలేదు. ఒకవేళ ఏమైనా అడ్డంకులు వస్తే.. తామిద్దరం గుడికి వెళ్లి వివాహం చేసుకుంటామని తేల్చి చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా వీలు కాకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు వెల్లడించాడు.

No comments

Powered by Blogger.