అమెరికాలో ఇతరులకు ఇక ఉద్యోగాల్లేవ్…


కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని(ఇమ్మిగ్రేషన్‌) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.‘‘ఓ అదృశ్య శక్తి(కరోనా వైరస్‌) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.ఇది కార్యరూపం దాలిస్తే తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ ఉభయ దేశ వాసులదే సింహభాగం. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.No comments

Powered by Blogger.