మాస్కుల బయట చేత్తో తాకొద్దు|అక్కడా కరోనా ఉంటుంది…
వాడుతున్న మాస్కులపై వారానికిపైగా, స్టెయిన్లెస్ స్టీలు, ప్లాస్టిక్ వస్తువుల ఉపరితలంపై రోజుల తరబడి కరోనా వైరస్ జీవిస్తుందని హాంగ్కాంగ్ యూనివర్సిటీ (హెచ్కేయూ) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. గది ఉష్ణోగ్రతలో ఏయే వస్తువులపై ఎంతకాలం వైరస్ జీవిస్తుంది, అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
దాని ప్రకారం: గాజు వస్తువులపై రెండు నుంచి నాలుగు రోజుల దాకా, స్టీలు, ప్లాస్టిక్ వస్తువులపై నాలుగు నుంచి ఏడు రోజుల దాకా వైరస్ జీవిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా సర్జికల్ మాస్కులపై వారానికిపైగా వైరస్ జీవించి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కుల వెలుపలి వైపు తాకవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే గృహాల్లో వాడే క్రిమి సంహారకాలు, బ్లీచింగ్ పొడిని చల్లడం, తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ను సులభంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెప్పారు.
Post a Comment