పడకగదికి వస్తే ఆఫర్ ఇస్తానన్నాడు ! నిర్మాతపై హీరోయిన్ ఫైర్…


మరో హీరోయిన్ కూడా ఆ ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని, వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి మల్హర్ రాథోడ్…టెలివిజన్‌లో కొన్ని యాడ్స్ చేస్తుంది మల్హార్ రాథోడ్. 25 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో కూడా నటిగా గుర్తింపు కోసం పాకులాడుతుంది ఈ బ్యూటీ. యాడ్స్ కూడా లేని సమయంలో నటిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఓ సీనియర్ నిర్మాత నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది మల్హర్. నటిగా అవకాశమిస్తానని చెప్పి ఆయన తన బెడ్రూమ్‌లోకి రమ్మన్నాడని,అంతటితో ఆగకుండా తన షర్ట్ విప్పి చూపించాలని కోరాడని చెప్పింది ఈమె. ఆ నిర్మాత వయసు 65 ఏళ్లు అని చెప్పింది మల్హర్ రాథోడ్. కొందరు బాలీవుడ్ నిర్మాతలను కలవడానికి వెళ్లినపుడు వాళ్ల కోరికను విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పింది ఈమె.నీకు నటిగా అవకాశమిస్తానని, కానీ కచ్చితంగా షర్ట్ విప్పి చూపించాల్సిందే అని అడిగాడని చెప్పింది రాథాడ్. 65 ఏళ్ల ఆ నిర్మాత అలా అడిగేసరికి ఏం చెయ్యాలో కూడా తనకు అర్థం కాలేదని చెప్పింది రాథోడ్. అలా అడిగిన వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయానని చెప్పింది మల్హర్. ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలైన తర్వాత ఎందరో ముద్దుగుమ్మకు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మల్హర్ కూడా ఇదే చేసింది. దాదాపు 8 ఏళ్ల కింద తనకు ఎదురైన చేదు సంఘటన గురించి, అక్కడ ఆయన పెట్టిన కండీషన్ గురించి బయటపెట్టింది ఈమె.నటి కావాలనేది తన కల, లక్ష్యం కానీ అందుకోసం పక్కదారులు తొక్కనని, నిర్మాతల పక్కలు ఎక్కనని చెబుతుంది ఈమె. అవకాశాలు దొరకకపోతే వేరే కెరీర్ ఎంచుకుంటాను కానీ తప్పుడు పనులు చేయనని చెబుతుంది మల్హర్. తనకు ఇద్దరు చెల్లెళ్లతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులకు తన సంపాదనే జీవనాధారమని చెబుతుంది ఈమె. హాట్‌స్టార్‌లో వచ్చే హోస్టేజస్ షోతో ఇండస్ట్రీకి వచ్చిన రాథోడ్ ఇప్పుడు టాప్ మోడల్స్‌లో ఒకరిగా నిలిచింది. తనలాగే ప్రీతి జింటా, దీపికా పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ముందు యాడ్స్ నుంచి వచ్చి తర్వాత అగ్రస్థాయికి ఎదిగారని.. తన రోజు కూడా వస్తుందని చెబుతుంది ఈమె.No comments

Powered by Blogger.