కరోనాను జయించిన తెలుగు ఎన్నారై దంపతులు…


ఇండియాలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకుపోవాలనీ, ఐసోలేషన్ వార్డులో ఉంచేయాలనే అభిప్రాయం ఉంది. ఐతే, కరోనా పాజిటివ్ అయిన ప్రతీ ఒక్కర్నీ అలా తీసుకెళ్లాల్సిన పనిలేదంటున్నారు లండన్‌లో నివసిస్తున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు.నిజామాబాద్ బోధన్‌కి చెందిన ఆయన, కాకినాడలో MBBS చేశారు, సైకాలజీ చదివేందుకు పాతికేళ్ల కిందట లండన్ వెళ్లారు. అక్కడ హ్యూమన్ సైకాలజీ పూర్తి చేశారు. అక్కడే స్థిరపడ్డారు. లండన్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. 6 వారాల కిందట ఆయన భార్య హేమకు కరోనా పాజిటివ్ వచ్చింది. లండన్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.

ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచించారు. ఐతే ఆమెకు డయాబెటిస్‌తోపాటూ, హైపర్ టెన్షన్ కూడా ఉండటంతో, ఆమెను ప్రత్యేక గదిలో ఉంచిన డాక్టర్ శేషగిరిరావు, తమ కవల పిల్లల్ని వేరే గదిలో ఉంచారు. భార్యకు సేవలు చేస్తుండగా, ఆయనకు కూడా కరోనా సోకింది. ఇలా దంపతులు ఇద్దరూ కరోనా బారిన పడి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ పొందాల్సి వచ్చింది.హేమకు కరోనా వచ్చిన రెండ్రోజులకు ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆకలి లేదు. మూడో రోజు దగ్గు, తర్వాత జ్వరం వచ్చాయి.
దంపతులు ఇద్దరూ పాజిటివ్ ఆలోచనలతో ముందుకుసాగారు. కరోనాపై తప్పక గెలవాలని మానసికంగా బలంగా నిర్ణయించుకున్నారు.
ప్రతి రోజూ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి వారితో మాట్లాడుతూ, ధైర్యం పొందేవారు. స్నేహితుల సలహాలు పాటించారు.
  • దగ్గుకు దగ్గు మందు, జ్వరానికి జ్వరం టాబ్లెట్లు వంటివి వేసుకున్నారు. రోజుకు రెండుసార్లు గోరు వెచ్చటి ఉప్పు నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేవారు.
  • హేమకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటం వల్ల యాంటీ బయోటిక్స్ కూడా వాడారు.- ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) పెంచుకోవడానికి, రోజూ ఉదయాన్నే ఓ టీస్పూన్ పసుపు, కొద్దిగా అల్లం, కొద్దిగా మిరియాలు వేసిన ఓ కషాయాన్ని ఓ లీటర్ తయారుచేసుకొని, దాన్ని ఇద్దరూ చెరు సగం తాగేవాళ్లు.

  • అలాగే ఓ లీటర్ నీటిలో ఓ నిమ్మకాయ పిండుకొని ఆ నీటిని రోజంతా తాగేవాళ్లు.
  • విటమిన్ టాబ్లెట్లు, జింక్ టాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ టాబ్లెట్లు వాడేవారు.
  • ఆకలి వెయ్యకపోయినా ఆహారం ఎక్కువగా తీసుకునేవారు. కరోనా వైరస్ శరీరంలో శక్తిని చాలా త్వరగా పీల్చేస్తుంది. రోజురోజుకూ మనుషులు వీక్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి, ఆహారం చాలా ఎక్కువగా తీసుకున్నారు. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, చారులో వెల్లుల్లి, జీలకర్ర ఎక్కువగా వేసేవాళ్లు.
  • ఇంట్లో ప్రతీదీ శుభ్రంగా ఉండేలా చేశారు. పిల్లలు తమకు టచ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ డిస్టాన్స్ పాటించారు.
  • దగ్గు రాన్రానూ పెరిగింది. ఐదో రోజు నుంచి పదో రోజు వరకూ కరోనా వైరస్ ఎక్కువగా పెరిగింది. 11వ రోజు నుంచి తగ్గుతూ వచ్చింది. 14 తర్వాత పూర్తిగా తగ్గింది.

No comments

Powered by Blogger.