మృతదేహంపై పడి ఏడ్చిన బంధువులు కూడా…
గుండెపోటుతో కరోనా అనుమానితుడి మృతి, మృతదేహంపై పడి ఏడ్చిన బంధువులు కూడా ఐసోలేషన్‌కు తరలింపు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున కరోనా అనుమానితుడు(62) గుండెపోటుతో మృతి చెందాడు. నగరంలోని బర్కత్‌పురకు చెందిన వ్యక్తిని రెండు రోజుల క్రితం కరోనా అనుమానంతో ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచగా, సోమవారం ఉదయం అతనికి గుండెపోటు వచ్చింది. గమనించిన వైద్యులు అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతడి బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహంపై పడి ఏడ్వడంతో వారందరినీ కూడా ఐసోలేషన్‌కు తరలించారు.
ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి మరణించడంతో అతని బంధువులు వచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అతడు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. ఈ విషయమై జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ, అతడిని హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లలో ఉండగానే మృతి చెందాడని, అతనికి కరోనా ఉన్నది లేనిది పరీక్షల రిపోర్టు వస్తేగాని తెలియదని అన్నారు.
Post a Comment