కరోనా దెబ్బ: భారీగా పతనమైన రియల్ ఎస్టేట్…


కరెన్సీ నోటు నాకి, చీది భయపెట్టిన వ్యక్తి అరెస్టు:కొందరు ఆకతాయిలకు కరోనా వైరస్‌ తీవ్రత అర్థం కావడం లేదు! సామాజిక మాధ్యమాల్లో వెకిలి, నకిలీ, భయపెట్టే సమాచారం, చిత్రాలు, వీడియోలు సృష్టిస్తున్నారు. నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ (38 ఏళ్లు) కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. ఔషధం లేని నావెల్‌ కరోనా వైరస్‌ ‘దేవుడి శాపం’ అంటూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు.‘కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు (సయ్యద్‌) వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్‌ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది’ అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు అత్యవసర సర్వీస్‌కు ఫోన్‌ చేసి సమోసాలు తీసుకొస్తారా అని అడిగిన ఆకతాయితో పోలీసులు మురికి కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయించిన సంగతి తెలిసిందే.

పేరుకుపోతున్న ఇన్వెంటరీ:‘ఇది పూర్తిగా బయర్‌‌ మార్కెట్. ఒకవేళ ఎవరైనా నిజంగా డీల్ కుదుర్చుకోవాలనుకుంటే, ధరలను తగ్గించాల్సిందే’ అని ముంబైలోని రహేజా రియాల్టీ సంస్థకు చెందిన రామ్ రహేజా తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదేళ్ల రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఉంది. ఇదే ఆల్‌‌ టైమ్ హై ఇన్వెంటరీ. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆన్‌‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌‌టైగర్ జనవరి రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది మేజర్ రెసిడెన్షియల్ మార్కెట్లలో రూ.6 లక్షల కోట్ల అమ్ముడుపోని యూనిట్లు ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ డెవలపర్లు తమ స్టాక్స్‌‌ ను లిక్విడేట్ చేసుకోలేకపోతే, డిఫాల్ట్ పెరుగుతాయని బ్యాంక్‌‌లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.బ్యాంకుల్లో మొండి బకాయిలకు మరో 140 బిలియన్ డాలర్లు యాడ్ అవుతాయని తెలుస్తోంది. గత కొన్ని క్వార్టర్ల నుంచి పడిపోతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను కోలుకునేలా చేయడానికి ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. డబ్బులు లేక చాలా ప్రాజెక్ట్‌‌ లు స్ట్రక్ అయ్యాయి. కొనుగోలుదారుల వద్ద ఫండ్స్ ఉండటం లేదు. దీంతో లిక్విడిటీకి బూస్టప్ ఇస్తోంది ఈ సమయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను మరింత దెబ్బకొడుతోందని డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments

Powered by Blogger.