కరెన్సీ నోటు నాకి, చీది భయపెట్టిన వ్యక్తి


కరెన్సీ నోటు నాకి, చీది భయపెట్టిన వ్యక్తి అరెస్టు:

కొందరు ఆకతాయిలకు కరోనా వైరస్‌ తీవ్రత అర్థం కావడం లేదు! సామాజిక మాధ్యమాల్లో వెకిలి, నకిలీ, భయపెట్టే సమాచారం, చిత్రాలు, వీడియోలు సృష్టిస్తున్నారు. నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ (38 ఏళ్లు) కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. ఔషధం లేని నావెల్‌ కరోనా వైరస్‌ ‘దేవుడి శాపం’ అంటూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు.‘కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు (సయ్యద్‌) వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్‌ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది’ అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు అత్యవసర సర్వీస్‌కు ఫోన్‌ చేసి సమోసాలు తీసుకొస్తారా అని అడిగిన ఆకతాయితో పోలీసులు మురికి కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయించిన సంగతి తెలిసిందే.

No comments

Powered by Blogger.