జూన్ 1నుండి 200 రైళ్లు నడవబోతున్నాయి.! రెండు తెలుగు రాష్ట్రాలకు 8 రైళ్లు నడుస్తాయి..!


దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైళ్లు:

ఆన్లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్ లొనే రిజర్వేషన్. సాధారణ టికెట్లు ఉండవు.కంఫర్మ్ రిజర్వేషన్ ఉన్న వారు మాత్రమే స్టేషన్ కి రావాలి. మాస్క్ తప్పనిసరి ధరించాలి. ఆహారం మాత్రం టేక్ అవే తీసుకెళ్లాలి. రెండు రాష్ట్రాల్లో 8 రైళ్లలో
సికింద్రాబాద్ నుండి 4 రైళ్లు: హౌరా, ధనపూర్, గుంటూరు, నిజాముద్దీన్

హైదరాబాద్ 3 రైళ్లు: న్యూఢిల్లీ, ముంబై, వైజాగ్తిరుపతి నుండి నిజామాబాద్ కి ఒక రైలు, ఇంకొకటి నాందేడ్ నుండి అమృత్సర్ కి రైలు. ప్రత్యేక రైలు సర్వీసుల ద్వారా ప్రయాణించాలనుకునే రైలు ప్రయాణికులు ఈ క్రింది సూచనలు పాటించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది.


  1. రైలు బయలుదేరడానికి కనీసం 90 నిమిషాల ముందు రైల్వే స్టేషన్ చేరుకోవాలి.
  2. అధీకృత ప్రయాణ టిక్కెట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు.
  3. ఈ రైళ్లకు రిజర్వు చేయని టిక్కెట్లు ఇవ్వబడవు. 4.కోవిడ్ -19 లక్షణాలతో ఉన్న ప్రయాణికులు ప్రయాణించడానికి అనుమతించబడదు.
  4. రైళ్ల లోపల దుప్పట్లు ఇవ్వబడవు.
  5. దయచేసి మీ స్వంతంగా తీసుకెళ్లగలిగే కనీస సామాన్లతోనే ప్రయాణించండి.
  6. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు రైళ్ళలో ప్రయాణించకుండా ఉండడం శ్రేయస్కరం.
  7. దయచేసి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి అలాగే రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించండి.

No comments

Powered by Blogger.
close