సమంత నటనలోనే కాదు చదువులోనూ సుపర్…


తనదైన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ద రోజుల్లోనే టాప్ హీరోయిన్ అయ్యింది. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోతుంది. అదీ సమంత టాలెంట్. సమంత మంచి నటి మాత్రమే కాదు. గుడ్‌ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్‌ కూడా. స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇందుకు నిదర్శనం. 10, 11వ క్లాసుల్లో మంచి మార్కులే సంపాదించిందీ బ్యూటీ. ఇందుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్సు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు సమతం ఫేస్ బుక్ పేజీలో ఉంది.చెన్నైలోని CSI సెయింట్‌ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంత చదువుకుంది. 2002లో పదో తరగతిలో Maths పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా..Maths పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మొత్తంగా వెయ్యి మార్కులకు గాను 887 మార్కులు వచ్చాయి. సమంత మా స్కూల్ కు ఓ ఆస్తి అని అందులో రాసి ఉంది. అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టుల వారిగా ప్రతిభను కనబర్చింది.

No comments

Powered by Blogger.
close