పాక్‌ క్రికెట‌ర్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా...


ఏ వుడ్ అయినా స‌రే, సినిమా వాళ్ల‌పై రూమ‌ర్స్ త‌ప్ప‌వు. కొన్నిసార్లు అవి వారి ఉనికి గుర్తు చేస్తుంటే మ‌రికొన్నిసార్లు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారుతాయి. సినీ సెల‌బ్రిటీలే కాదు, స్పోర్ట్స్ సెల‌బ్రిటీల‌కు ఈ ముప్పు త‌ప్ప‌దు. అప్ప‌ట్లో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్‌ను పెళ్లాడ‌నుంద‌హో అని పుకారు రాయుళ్లు ద‌రువేసి మ‌రీ చాటింపు చేశారు. ఆ త‌ర్వాత అదే నిజ‌మైంది కూడా, ఇన్నాళ్ల‌కు మ‌రో పాక్ క్రికెట‌ర్‌తో ఓ టాలీవుడ్‌ తార ప్రేమ‌లో ఉందంటూ వార్త‌లు మొద‌లయ్యాయి. దీనికి సంబంధించి త‌మ‌న్నా , పాక్‌ క్రికెట‌ర్ అబ్దుల్ ర‌జాక్‌ ఒకే ఫ్రేములో ఉన్న‌ ఫొటో వైర‌ల్ అవుతోంది.కాబోయే భార్య‌కు ద‌గ్గ‌రుండి మ‌రీ న‌గ‌లు కొనిస్తున్నాడంటూ అబ్దుల్ ర‌జాక్‌ను ఆడేసుకుంటున్నారు. అయితే ఈ రూమ‌ర్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందీ మిల్కీ బ్యూటీ. “ఒక‌రోజు న‌టుడి పేరు చెప్తారు. మ‌రో రోజు క్రికెట‌ర్ అంటారు, ఇటు డాక్ట‌ర్ అంటారు, అటు క్రికెట‌ర్ అంటారు. ఇలా అంద‌రితో రిలేష‌న్‌షిప్ అంట‌గ‌ట్ట‌డం ఏంట”‌ని క‌డిగి పారేసింది. త‌ను ఎవ‌రితోనూ డేటింగ్‌లో లేన‌ని క్లారిటీ ఇచ్చేసింది. మ‌రి ఫొటో అంటారా? గ‌తంలో దుబాయ్‌లో ఓ న‌గ‌ల షాపు ప్రారంభోత్స‌వానికి త‌మ‌న్నాతో పాటు, అబ్దుల్ కూడా వెళ్లాడు. అప్పుడు తీసిందేన‌న్న‌మాట‌ ఈ ఫొటో.

No comments

Powered by Blogger.