శోభానాన్ని అడ్డుకున్న అధికారులు.. కోత్త జంట ఆశలు ఆవిరి..! అన్నీ సిద్ధం చేసుకన్నాం ఈ ఒక్క రాత్రికి వదిలేయండని…


 మంచం మీద మల్లెపూలు మత్తెక్కిస్తూ, సుగంథ పరిమళాలు మాంచి కిక్కెస్తున్న సమయంలో ఊహించని అంతరాయం తలుపు తట్టింది. జీవితాంతం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన ఆ రోజును చేదు జ్ఞాపకంగా మార్చేసింది. ఆ ఊహించని అంతరాయం మరేదో కాదు. కరోనా భూతం. అదేంటీ, పెళ్లికి అడ్డురాని కరోనా, పాపం వాళ్ల శోభనానికి ఎలా అడ్డువచ్చిందనేగా మీ అనుమానం.అయితే, తప్పకుండా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. కుత్యూరుకు చెందిన వధువు.. బోలా జిల్లాకు చెందిన యువకుడిని ఇటీవలే పెళ్లాడింది. లాక్‌డౌన్ వల్ల ఇరువురికి కుటుంబ పెద్దల సమయంలో పెళ్లితంతు ముగించారు. తొలిరాత్రి కోసం వరుడి ఇంట్లో ఏర్పాట్లు చేశారు. దీంతో వరుడు.. తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి శోభనానికి సిద్ధమవుతుండగా ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే శోభనం ఆపాలని ఆదేశించారు. దీంతో షాకైన కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.తమ ఇంట్లో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, బయట నుంచి కూడా ఎవరూ రాలేదని చెప్పారు. వరుడు ఇటీవల మంగళూరు నుంచి వచ్చినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, రెడ్ జోన్ నుంచి వచ్చినందుకు అందరూ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. శోభనానికి అన్నీ సిద్ధం చేశాం. ఈ రాత్రికి వదిలేయండని కుటుంబ సభ్యులు అధికారులను బతిమాలినా లాభం లేకపోయింది.No comments

Powered by Blogger.