మందు బాబులకి షాక్ ఇచ్చిన ఏపి ప్రభుత్వం…


మద్యం ధరలు 75 శాతం పెరిగాయి:

రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలను 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. పెంచిన ధరలు నేటి మంగళవారం నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి . అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎక్సైస్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ మాట్లాడుతూ.. కొత్తగా పెంచిన 50 శాతం ధరలను నేటి నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు.ఆధార్‌ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం​​​​​​​:మద్యం కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌ కార్డు, గొడుగుతో రావాలని గుంటూరు జిల్లా తెనాలి పట్టణ సీఐ హరికృష్ణ వినూత్న నిబంధన పెట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో దాదాపు నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు సోమవారం తెరచుకున్నాయి.
దీంతో మందు బాబులు మద్యం కోసం ఎగబడ్డారు. భారీ సంఖ్యలో దుకాణాల వద్దకు తరలివచ్చి, సామాజిక దూరం సైతం పాటించకుండా మండుటెండల్లో గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. దీని కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందని గ్రహించి ఈ నిబంధనలు పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి చర్యల కారణంగా సామాజికదూరంతోపాటు ఎండ వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

No comments

Powered by Blogger.