ఆ ‘రేప్‌ కేసు’తో యాంకర్‌ ప్రదీప్‌కి సంబంధం లేదు.!


ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 139 మంది.. ఆమెపై అత్యాచారం చేశారట.. దాదాపు ఐదు వేల సార్లు ఆమె అత్యాచారానికి గురయ్యిందట. బాధితురాలు, పోలీసుల్ని ఆశ్రయించేదాకా ఈ ఘోరం వెలుగు చూడలేదు. పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ అయినప్పటినుంచీ ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.బుల్లితెర యాంకర్‌ ప్రదీన్‌ తెరపైకి రావడంతో, ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. సినీ నటుడు కృష్ణుడు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది ఆయనా వివరణ ఇచ్చుకున్నాడు ఆ కేసుతో తనకు సంబంధం లేదని. తాజాగా బాధితురాలు మీడియా ముందుకొచ్చింది.

ప్రదీప్‌కి ఈ కేసుతో సంబంధం లేదనీ, ‘డాలర్‌ బాయ్‌’ అనే వ్యక్తి కుట్రపూరితంగా కొన్ని పేర్లను లిస్ట్‌లో చేర్చాడనీ, అతని బ్లాక్‌మెయిలింగ్‌కి తలొగ్గి తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది.మరోపక్క, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బాధితురాలితో మాట్లాడారు. ఆమెకు అండగా వుంటానని అన్నారు. ఈ కేసుతో యాంకర్‌ ప్రదీప్‌కి సంబంధం లేదని మందకృష్ణ చెప్పడం గమనార్హం.

మొత్తమ్మీద, యాంకర్‌ ప్రదీప్‌ ఈ వివాదం నుంచి ప్రస్తుతానికి బయటపడినట్లే కన్పిస్తోంది.

No comments

Powered by Blogger.
close