అద్దాల వెనుక రహస్య గదులు…


తమిళనాడు కోయంబత్తూరులోని ఓ లాడ్జిలో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు అవాక్కయ్యే ఘటన ఎదురైంది. అద్దాల వెనుక రహస్య గదుల్లో వ్యభిచారం జరుగుతుండటాన్ని పోలీసులు షాక్ తిన్నారు. కోయంబత్తూరులో ఉన్న శరణ్యా లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అన్ని గదుల్లో తనిఖీలు చేసిన అనుమానించతగ్గ వారు ఎవరూ కనపడలేదు. కానీ ఓ రూమ్ లో మాత్రం వారికి రెండు పెద్ద అద్దాలు కనబడ్డాయి.లాడ్జిలో రెండు పెద్ద అద్దాలు, అవి ఎదురెదురుగా ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఒక అద్దాన్ని కదిలించి చూశారు. దాని వెనుక ఓ రహస్య గది ఉంది. దాంట్లో 22 సంవత్సరాల యువతి పట్టుబడింది. యువతిని బెంగళూరుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకుని వచ్చి దందా నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో తెలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

No comments

Powered by Blogger.
close