మందుకొడితే, గంజాయి తాగుతా..! ఒప్పుకున్న సినీ నటి రాగిణి…


తాను ఇప్పటి వరకు రెండుసార్లు ఎం.డి.ఎం.ఎం. డ్రగ్‌ తీసుకున్నానని డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో కన్నడ సినీనటి రాగిణి అంగీకరించిందని సమాచారం. అవి ఎక్కడ దొరుకుతాయో తనకు తెలియదని రవిశంకర్‌, రాహుల్‌శెట్టి ఇచ్చేవారని తెలిపింది. గంజాయి నింపిన సిగరెట్లూ వారే ఇచ్చేవారని విచారణలో వివరించింది. మద్యంతో పాటు సిగరెట్‌ తాగేదానినని అంగీకరించింది. యలహంక జ్యుడీషియల్‌ లేఔట్‌లో రాగిణి నివాసంపై దాడి చేసిన సమయంలో గంజాయి నింపిన ఎనిమిది సిగరెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు.
రవిశంకర్‌తో కలిసి ఆమె ఆఫ్రికాకు చెందిన కొందరి నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి పార్టీల్లో విక్రయించేవారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. కొన్నింటిని కొరియర్‌ ద్వారా, డార్క్‌వెబ్‌ సైట్ల నుంచి తెప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు. హైఫై పార్టీల్లో కొందరు రాజకీయ నాయకులు, కీలక అధికారుల కుటుంబీకులు, సినీ నటులు పాల్గొనేవారని తెలిసింది. మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న 20 మంది పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.No comments

Powered by Blogger.
close