ఈ అందమైన హీరోయిన్ ఓ హిజ్రా అని మీకు తెలుసా...?కొంద‌రు హీరోయిన్ల‌ను చూడ‌గానే అతిలోక సుంద‌రి భువికి దిగి వ‌చ్చిన దేవ‌తలా ఉంది అంటాం..
ఇలాంటివారి అందానికి ఫిదా అవుతారు
అయితే ఇప్పుడు చాలా వ‌ర‌కూ కొంద‌రు ఆ అందాల‌ను చూసి అస‌లు ఆమెనా లేదా ట్రాన్స్ జెండ‌రా అని ఆశ్చ‌ర్య‌పోతారు
అవును ఓ అందాల భామ హీరోయిన్ గా పేరు గ‌డించింది
కాని వంపు సొంపుల ఈ భామ ఇంత‌కీ ట్రాన్స్ జెండ‌ర్….
మ‌రి ఆమె స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం.2018 సంవత్సరంలో ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ దర్శకత్వం వహించినటువంటి పెరంబు అనే చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది…ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా మమ్ముట్టి, అంజలి అమీర్ నటించారు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అంజలి అమీర్ తన అందంతో తమిళ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వసూళ్లను కూడా సాధించి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.అయితే ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి అంజలి అమీర్ ఓ ట్రాన్స్ జెండర్ అని. కానీ ఈ చిత్రం చూస్తున్నంత సేపు మనకు అంజలి అమీర్ ఎక్కడా కానీ ఆమె ఓ ట్రాన్స్ జెండర్ అన్న భావన కలగదు.ఈ అమ్మడు అందం తోనే కాకుండా తన నటన పరంగా కూడా పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది.అంతేకాక తమిళ్ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.అయితే ఆ సమయంలో కొంతమేర అనారోగ్య కారణాల వల్ల అనుకోకుండా బయటికి వచ్చింది.అయితే తను హీరోయిన్ గా నటించినటువంటి పెరంబు చిత్రం మంచి హిట్ అవడంతో అప్పట్లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ ఫేమ్ ని దక్కించుకుంది..కానీ ఈ మధ్య కాలంలో ఏమైందో ఏమో కానీ సినీ పరిశ్రమలో అస్సలు కనిపించడం లేదు.దీంతో పలువురు అంజలి అమీర్ అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు…అలాగే మరికొంతమంది మాత్రం హిజ్రాలను గౌరవిస్తూ అంజలి అమీర్ కి హీరోయిన్ గా నటించేందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గాను స్టార్ హీరో మమ్ముట్టి కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.అయితే ఓ తమిళ ప్రముఖ దర్శకుడు అంజలి అమీర్ జీవిత గాథ ఆధారంగా ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి పలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments

Powered by Blogger.
close