256 ఏళ్ళు బతికి చివరికి ఇన్నాళ్లు ఎలా బతికాడో రహస్యం చెప్పేసాడు

 


మనిషి 100 సంవత్సారాలు బ్రతికితే గొప్ప అనుకుంటారు. అలాంటిది వంద ఏళ్లు దాటితే  అదో వింతలా వార్తల్లో వస్తుంది. ఒకప్పుడు మాత్రం చాలా మంది నూరేళ్లకు పైగా బ్రతికారు. కానీ అప్పట్లో కూడా ఓ వింత చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికాడు. ఇది అందరికి ఆశ్చర్యకర విషయమే. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 256 సంవత్సారాలు బ్రతికినట్లు ఆధారాలు ఉన్నాయి.

లీ చింగ్ యన్ 1933 లో మరణించాడు. ఆయన మరణించేటప్పటికీ అతని వయస్సు 256 సంవత్సరాలు. ఇది చరిత్రలోనే తొలిసారి జరిగిన ఘటన. చైనాలోని సిచుయాన్ ప్రాంతంలో జన్నించిన లీ చింగ్ 10 సంవత్సరాల వయసులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనే ప్రాంతాల్లో తిరిగాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేక చోట్ల కాలం గడిపిన లీ చింగ్ 72 సంవత్సరాల వయసులో కైక్సియన్ ప్రాంతానికి చేరుకున్నాడు. 1749 లో ఆర్మీ లో చేరి మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా విధులు నిర్వహించాడు.

 1927లో తిరిగి ఆయన స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి ఆయనకు 24 మంది భార్యలు, 500 మంది పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబం లో 11 తరాలను చూశాడు. చివరికి 1933లో మరణించాడు. అయితే అయాన్ వయసు పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్ స్వయంగా తాను 1736లో జన్నించానని చెప్పాడట.

అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677 లో జన్మించినట్లు చెబుతున్నాడు. అయితే 1930లో న్యూయార్స్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం చైనా ప్రభుత్వం లీచింగ్ కు 1827లో 15  వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని, 1877లో 200 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఈ రెండు కథనాలు ప్రకారం లీ చింగ్ 197 ఏళ్లు తేదా 256 ఏళ్లు బ్రతికినట్లు తెలుస్తోంది.

No comments

Powered by Blogger.
close