మగాడి బాధ, పెళ్లై 3నెలలు కాలే, అప్పుడే గుడ్ న్యూస్.!


 పెళ్ళి అయేంత వరకు ఒక బాధ పెళైనా తర్వాత మరో బాధ. పెళ్ళి జరిగి కొద్ది నెలలు గడిచిందో లేదో అప్పుడే “ఏమైనా గుడ్ న్యూస్” అంటూ పలకరింపులు. అసలు విషయాన్ని నేరుగా చెప్పలేక సతమతమయేవారు చాలా మంది. రోజులు గడుస్తున్నా భార్య గర్భవతి కాలేదన్న మానసిక వేదనకు తోడు ఇతరులు దెప్పి పొడుపులు ఒకటి. ఇలాంటి పరిస్థితిని అనుభవించిన మగాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక లోపం తనిది తేలిస్తే మాత్రం ఆ వేదన వర్ణణతీతం. కొన్ని సార్లు లోపం భార్యది కూడా కావోచ్చు. ఏడాది పాటు సంసార జీవితాన్ని గడిపినా కూడా భార్య గర్భం దాల్చకపోతే ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే గైనకాలజిస్ట్ ను కలవాలి. ఇద్దరికీ టెస్టులు నిర్వహిస్తారు. పురుషుడి స్మెర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల నుంచి 200 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఆ స్థాయిలో కౌంట్ ఉంటేనే ఆ వీర్యం గర్భం దాల్చడానికి పనికొస్తుంది. లేకుంటే డాక్టర్ చెప్పే సూచనలు, సలహాలు పాటించాలి. అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా ఇస్తారు. పెళ్లయ్యాక ఈ సమస్యను ఎదుర్కోవడం కంటే పెళ్లికి ముందే కుర్రాళ్లు స్మెర్మ్ కౌంట్ లోనూ కింగ్‌లనిపించుకోవడమే ఉత్తమం.

దానికి చేయాల్సిందల్లా కొన్ని కొన్ని ఆహార పదార్థాలను వాడటం మొదలుపెడితే చాలు. వీర్య నాణ్యతను వాటంతట అవే వృద్ధి చేస్తాయి. అవేంలో ఓసారి చూద్దాం. బచ్చలి కూర మగాళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల స్పెర్మ్వా క్వాలిటీని సంరక్షించడంలో దోహదం చేస్తాయి. వారానికి రెండు సార్లయినా బచ్చలికూరను తీసుకోవడం మంచిది. వాటితో పాటు గుమ్మడికాయ గింజలు, డార్క్ చాకొలెట్స్, అరటికాయలు, గుడ్లు, దానిమ్మ, ఆరెంజ్ లాంటివి తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

No comments

Powered by Blogger.
close