30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ హిట్టా.. పట్టా...?
ప్రదీప్ మాచిరాజు ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండారు. బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కరోనా తేకపోతే ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఇప్పటికే థియేటర్లలో ఉండేది.
ఈ చిత్రాన్ని సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేశాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎస్వీ బాబు నిర్మించాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ అనే తమిళ అమ్మాయి నటించింది.
ఈ సినిమాలోని నీలీ నీలీ ఆకాశం పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అద్భుతంగా చేశాడు. రికార్డు స్థాయి వ్యూస్ దక్కించుకుంది ఈ పాట. దాదాపుగా యూట్యూబ్ లో 223 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కరోనా కారోనా కారణంగా థియేటర్లు మూతబడి విడుదలకు నోచుకోలేకపోయిన ఈ సినిమా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో విడుదలకు రెడీ అయ్యింది. కథ మాత్రం అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. అలాగే ప్రదీప్ నటన కూడా చాలా బాగందని అంటున్నారు. ప్రదీప్ ఖాతాలో హిట్ పడినట్లు తెలుస్తోంది.
Post a Comment