నాన్‌వెజ్ ప్రియులకు బంపర్ ఆఫర్.! మాంసం మానేస్తే 50లక్షలు…


 ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఓ బంపర్ ఆఫర్.! కాస్త ఓపిక పట్టుకుని మూడు నెలలు మాంసం ముట్టకుండా ఉంటే, ఏకంగా 50లక్షలు గెలుచుకోవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే. బ్రిటన్ లోని వైబ్రంట్ వీగన్ అనే కంపెనీ.. ‘వీగన్ క్యూరియస్ కోఆర్డినేటర్’గా పని చేసేందుకు అప్లికేషన్స్ తీసుకుంటుంది.

ఇందులో కో ఆర్డినేటర్ గా ఎంపికైతే మూడు నెలల వరకూ అచ్చంగా వీగన్ డైట్ మాత్రమే తీసుకోవాలి. మూడు నెలలపాటు మాంసాహారం తినకుండా.. సోషల్ మీడియాలో వీగన్ డైట్ గురించి ప్రచారం చేయాలి. అయితే పూర్తి మాంసాహారులైన వారికే ఈ ఆఫర్. అంతేకాదు మూడునెలల తర్వాత నాన్ వెజ్ పూర్తిగా మానేస్తాం అన్నవారికి కోటి రూపాయాల విలువైన వీగన్ ప్రొడక్ట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

No comments

Powered by Blogger.
close