టాలీవుడ్‌లో పాగా వేస్తున్న ప్రియా వారియర్…

 

రెండేళ్ల కింద దేశమంతా పాపులర్ అయిన ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ చేసిన మాయ అంతా ఇంతా కాదు. కేవలం 30 సెకండ్స్ వీడియోలో కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది ప్రియా. అప్పట్లో ఈ వీడియో పై ఎన్నో వేల ట్రోల్స్ వచ్చాయి. ఈ భామ ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒకేసారి రెండు సినిమాలతో వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. నితిన్‌, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘చెక్‌’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది ప్రియ. ఇందులో రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. మరోవైపు తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న ఇష్క్ సినిమాలో కూడా ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ చిన్న పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. అందులో చాలా అందంగా కనిపిస్తుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

ఇప్పటికే మలయాళ సినిమాల్లో నటిస్తుంది. కానీ అక్కడ కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు. అందుకే టాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇక్కడ కానీ పాపులర్ అయ్యిందంటే వింక్ బ్యూటీకి తిరుగుండదు. కచ్చితంగా అవకాశాలు అద్భుతంగా వస్తాయి. అందుకే చెక్ విడుదలయ్యేంత వరకు ఓపిగ్గా వేచి చూస్తుంది ప్రియా వారియర్. ఆ తర్వాత కచ్చితంగా తనకు ఆఫర్స్ వస్తాయని నమ్ముతుంది. మరోవైపు గాయనిగా కూడా ప్రయత్నిస్తుంది ప్రియా. ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాటలు పాడింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తెలుగులో కూడా తొలి అవకాశం కోసం చూస్తుంది ఈ బ్యూటీ. ఏదేమైనా కూడా అటు నటిగా, ఇటు గాయనిగా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతుంది ప్రియా వారియర్.

No comments

Powered by Blogger.
close