ఆ కారును ఐదేళ్ల కుర్రాడు నిల్చొని నడిపాడు వైరల్ అవుతున్న ఆ వీడియో..? Watchఈరోజుల్లో పెద్దలు చేసే సహాసాల కంటే చిన్నపిల్లల సాహసాలే ఎక్కువయ్యాయి. సాంకేతికంగా ప్రపంచం మారుతుండడంతో చిన్నారుల్లో నైపుణ్యం పెరుగుతోంది. దీంతో వారు ఊహించని విధంగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాలు మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ చెడు  మార్గాలకు దారి తీస్తే మాత్రం వారి జీవితాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తాజాగా ఓ బుడ్డోడు తన స్థాయికి మించిన పనిచేశారు. చూసేవారికి ఇది అద్భుతమని అనిపించినా అలా చేయడం మాత్రం కరెక్టు కాదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ పిల్లాలు చేసిన పెద్దసాహసమేంటో చూద్దాం..

మనకు పొరుగు దేశమైన పాకిస్థాన్ సాధారణంగా వార్తల్లోకెక్కదు. రాజకీయంగా తప్పితే ఇలాంటి సాహసాల విషయంలో మనం తక్కున న్యూసే వింటాం. కానీ ఇటీవల ఐదేళ్ల కుర్రాుడు చేసిన పని పాకిస్థాన్ నుంచి బయటికి రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ స్రుష్టిస్తున్న ఈ వీడియోపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా నెటిజన్లు మాత్రం మెచ్చుకుంటున్నారు.

జనవరి 26న పాకిస్థాన్ లోని ముల్తాన్ నగరంలో టయోటా కంపెనీకి చెందిన కారు స్పీడుగా వెళ్తోంది. ల్యాండ్ క్రూజయిర్ వి 8 అనే కారు రయ్ రయ్ మంటూ ముందుకు సాగుతుంది. ఎవరో మంచి నేర్పరి డ్రైవర్ వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ తరువాత పోలీసులు దీనిపై  సీసీ పుటేజీని పరిశీలించగా షాక్ కు గురయ్యారు. కారులో ఉన్నది చిన్నపిల్లాడని గ్రహించారు.

అంతేకాకుండా ఆ బాలుడు నిల్చొని ఒక్కడే కారు నడపడంతో పోలీసులకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా వచ్చింది. ఇలా తల్లిదండ్రులు పక్కన లేకుండా చిన్న పిల్లాడికి కారు ఇవ్వడం సబబేనా..? అంటూ పోలీసులు ఆ తండ్రిని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. ఏదీ ఏమైనా పాకిస్థాన్ లో ఇలాంటి సహాసాలు చేసిన ఆ బుడ్డోడిని మాత్రం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

No comments

Powered by Blogger.
close