నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది…

 


కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రీతూ గోయల్(32), మేడ్చల్ జిల్లా బాహదూర్ పల్లిలోని టెక్ మహీంద్రా కంపెనీలో విధులకు వెళ్తుండగా, బాహదూర్ పల్లి – బౌరంపేట రహదారిపై అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయలవగా, 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను మదీన గూడ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో పడిపోయిన రీతూకు చెందిన సామాగ్రి ల్యాప్ టాప్, బంగారు గాజులు, ఫోన్, నగదు వంటివి అంబులెన్స్ సిబ్బంది, తన కుటుంబ సభ్యులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.

No comments

Powered by Blogger.
close