8మందితో ప్రేమ పెళ్లి తరువాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.! మాట వినకపోతే అంతే…

 


నిత్య పెళ్లికొడుకు అరాచకాలు బయటపడ్డాయి, అరుణ్‌కుమార్ అనే వ్యక్తి అరాచకాలపై బాధితులు మహిళ సంఘాలకు ఫిర్యాదు చేయడంతో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ ఇప్పటి వరకు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. గంజాయి, వ్యభిచార ముఠాతో అతడికి లింకులు ఉన్నాయని మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానని బెదిరించినట్లు ఆరోపించారు. మాట వినకపోతే తుపాకీ, కత్తులతో బెదిరించారంటున్నారు. గతంలో కూడా అరుణ్ కుమార్ గంజాయి స్మగ్లింగ్‌లో పలుమార్లు జైలు శిక్షను అనుభవించినట్లు చెబుతున్నారు.

పెళ్లైన మహిళల్ని కూడా టార్గెట్ చేసి వారిని బెదిరించి వ్యభిచారంలోకి దింపేవాడని ఓ మహిళ ఆరోపించింది. తన భర్తను అతడే హత్యచేసి తనను బెదిరించాడని.. ఆ వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అరుణ్ కుమార్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే మహిళ సంఘాల్ని కలిసి తమ బాధను చెప్పుకున్నామన్నారు. మహిళా చేతన అనే స్వచ్ఛంద సంస్థను బాధితులు ఆశ్రయించారు. మహిళా సంఘాలు ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే దర్యాప్తు చేయాలని సీపీ ఆదేశించారు.

No comments

Powered by Blogger.
close