వీళ్ళు యాడ్స్ తో ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

 

సినీ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హోమ్లీగా, పక్కింటి ఆడపిల్లల ఎంతగానో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ప్రేక్షక ఆదరణ పొందింది. స్నేహ, తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాలం, వెంకీ, వంటి హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్ షో కి చాలా దూరంగా ఉంటూ సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకొనేది. దాంతో మరో సౌందర్య గా ఈమె టాలీవుడ్ లో చక్రం తిప్పుతూ ఉంది అని అంతా అనుకున్నారు.. కానీ, కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం తో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో తమిళంలో అవకాశాలు రావడంతో కోలీవుడ్ కు వెళ్లిపోయింది. తమిళ్లో అచ్చముండు అచ్చముండు అనే సినిమా చేస్తున్న టైంలో సహ నటుడు ప్రసన్న తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణిస్తున్న స్నేహ, భర్త తో కలిస్తే కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ జంట కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, మరి లైట్, విం, grt జేవీలర్స్ లాంటి ఎన్నో యాడ్స్ లో నటించింది. ఇక స్నేహ కూడా వైభవ్ కలెక్షన్స్, ఆశీర్వాద్ గులాబ్ జామ్ వంటి యాడ్స్ లో నటించింది. ఇక వీళ్ళు చేసిన యాడ్స్ చాలా ఫేమస్ అవ్వడంతో వీళ్ళ తోనే యాడ్స్ కంటిన్యూ చేస్తున్నారు. యాడ్ మేకర్ ఇలా వీళ్లు యాడ్స్ రూపంలో భాగానే సంపాదించారు. ఎంత అంటే ఇప్పటికి రెండు కోట్ల 87 లక్షల వరకు సంపాదించారు అని తెలుస్తుంది. వీళ్లు నటించే యాడ్స్ లో కూడా డిమాండు ఉంటుందట. యాడ్స్ నిర్వాహకులను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అలాగా చూసుకోవడంతో వీళ్ళు తో ఆడ్ చేయడానికి వాళ్ళు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్నేహ ఒక పక్క తన భర్తతో ఆడ్స్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బానే సంపాదిస్తుంది. మొత్తానికి యాడ్స్ ద్వారా ఈ జంట కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు.


No comments

Powered by Blogger.
close