భార్గవ్ నిజస్వరూపం బయట పెట్టిన తన కో – యాక్టర్స్
టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలికను ఇది చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టిక్‌టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను పలుమార్లు ఇది చేసినట్లు విశాఖలో భార్గవ్‌పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను దెగ్గర చేసుకున్నాడు. ఇటీవలె బాలికలో ఏదో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది.
ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Post a Comment